ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెజాన్ ఎంటర్ అయ్యింది. వాల్ మార్ట్ కు పోటీగా రంగంలోకి దిగింది. ఫ్లిప్ కార్ట్ కొనుగోలుకి మేం కూడా సిద్ధం అని అమెజాన్ ప్రకటించింది. వాల్ మార్ట్ కంటే ఎక్కువ ధర చెల్లించటానికి అమెజాన్ సిద్ధం అయింది. వాల్ మార్ట్ 40శాతం వాటా కొనుగోలుకి సిద్ధం అయితే.. అమెజాన్ మాత్రం 51శాతం వాటాను భారీ ధరతో కొనుగోలు చేయటానికి ముందుకు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఫ్లిప్ కార్ట్ తో అమెజాన్ చర్చలపై రెండు కంపెనీల ప్రతినిధులు స్పందించలేదు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఫ్లిప్కార్ట్ కూడా నిరాకరించింది. 2007లో బెంగళూరుకు చెందిన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఫ్లిప్ కార్ట్ ను ప్రారంభించారు. పదేళ్లలో ఇండియాలో పెద్ద ఈ-కామర్స్ కంపెనీగా ఎదిగింది ఫ్లిప్ కార్ట్.