ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదు : గవర్నర్

governorముసలివాళ్లైన తల్లిదండ్రులను ఈ కాలం పిల్లలు పట్టించుకోవడం లేదని అన్నారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. పిల్లల మనస్తత్వం మారేలా.. సీనియర్ సిటిజన్ హోమ్స్ తొలగించాలన్నారు. పిల్లల ఆలోచనల్లో మార్పు తెచ్చేలా న్యాయ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చేసే తప్పులు, వాటికి పడే శిక్షలపై ప్రచారం చేయాలన్నారు. శనివారం (జూన్30) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో జరిగిన లీగల్ సర్వీసెస్ అవగాహన కార్యక్రమంలో గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తులు, హైదరాబాద్ సీపీ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates