ఈ గడ్డం ఆ సినిమా కోసమేనా : కొత్త స్టయిల్ లో ప్రిన్స్ మహేష్

maheshమహేష్ బాబు తన 25వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నాడు. సినిమాలో మహేష్ గడ‍్డం, మీసాలతో కనిపించనున్నారని సమాచారం. కొన్నాళ్లు ఇదే అంశంపై సినీ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుంది. ఫస్ట్ టైం ప్రిన్స్ మహేష్.. గడ్డంలో కనిపించబోతున్నాడని గుసగుసలాడుకుంటున్నాయి. అందుకు ఆధారంగా అన్నట్లు.. మహేష్ గడ్డంతో కనిపించాడు. టోపీ కూడా పెట్టాడు.

భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత ఫ్యామిలీతో విదేశాల‌కి వెళ్ళిన మ‌హేష్ నాలుగు రోజుల క్రితమే ఇండియాకి తిరిగొచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన మహేష్ లుక్‌ చూసి అందరూ షాక్ అయ్యారు. గడ్డం లుక్ కన్ఫామ్ అయినట్లేనా లేక ఛేంజ్ కోసం కొన్నాళ్లు అలా పెంచాడా అనేది షూటింగ్ ప్రారంభంలోనే తెలుస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌. అశ్వనీదత్‌, దిల్ రాజు నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. రాయ‌ల‌సీమ కథాంశంలో తెర‌కెక్క‌నున్న మ‌హేష్ 25వ చిత్రం భారీ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఆయన అభిమానులు.

Posted in Uncategorized

Latest Updates