ఈ-గవర్నెన్స్ తో మెరుగైన సేవలు : కేటీఆర్

ktregovernance1ఈ-గవర్నెన్స్ లో తెలంగాణ ముందుంది అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని HIIC వేదికగా ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు సోమవారం (ఫిబ్రవరి-26) ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర సహాయమంత్రి సీఆర్ చౌదరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం RTA-M వ్యాలెట్ రూపొందించామన్నారు. త్వరలోనే  టీ-యాప్ ఫోలియో లాంఛ్ చేస్తామన్న కేటీఆర్.. తెలంగాణలో4 వేల 500 మీ-సేవ సెంటర్లు ఉన్నాయన్నారు.

పౌరసేవల కోసం ఆర్టీఏ ఎం.వ్యాలెట్ అందుబాటులోకి తీసుకువచ్చాం.. కొద్ది రోజుల్లోనే 1.3 మిలియన్ ప్రజలు ఎం వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. మీ-సేవ ద్వారా ఇప్పటికే 10 కోట్ల ట్రాన్సెక్షన్స్ దాటిపోయిందన్నారు. TS ఐపాస్ తో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలు పర్మిషన్ ఇస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందుతాయన్నారు.  ఇంత వేగవంతమైన ప్రక్రియ దేశంలో ఎక్కడా లేదు. పరిశ్రమల అనుమతుల విషయంలో తెలంగాణ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. టీ వ్యాలెట్ ద్వారా సులభమైన పద్ధతిలో ట్రాన్సెక్షన్స్ ఉంటాయన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates