ఈ ఘోరం ఆస్పత్రిలోనిది : వీల్ చైర్ లేదు.. స్ట్రక్చర్ లేదు.. దుప్పటితో లాక్కెళ్లారు

patient-dragఅనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లింది ఓ మహిళ. కుటుంబ సభ్యులు హడావిడిగా వెహికల్ లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారికి మాత్రం అక్కడ షాక్.. పేషెంట్ ను లోపలికి తీసుకెళ్లటానికి స్ట్రక్చర్ లేదు.. కనీసం వీల్ చైర్ కూడా అందుబాటులో లేదు.. మోసుకెళ్లటానికి కుటుంబ సభ్యులకు వీలుకాలేదు. సిబ్బంది సహాయం కోరినా ఫలితం లేదు. దీంతో పేషెంట్ ను ఓ దుప్పటిలో కూర్చోబెట్టారు. ఆ దుప్పటిని పేషెంట్ బంధువులు లాక్కెళ్లారు. ఈ ఘోరం జరిగింది మహారాష్ట్రలోని నాంధేడ్ ప్రభుత్వ పెద్ద ఆస్పత్రిలో..

జూన్ 30వ తేదీ శనివారం ఉదయం నాంధేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. అనారోగ్యంతో ఉన్న మహిళను ఆస్పత్రిలోనే ఇలా దుప్పటిలో కూర్చోబెట్టి ఈడ్చుకెళ్లటం కెమెరాలకు చిక్కింది. లక్షల కోట్లు నిధులు ఆస్పత్రులకు ఇస్తున్నా.. ఇప్పటికీ ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. వీల్ చైర్ కూడా లేకపోవటం ఏంటీ.. ఆస్పత్రిలోనే ఈ ఈడ్చుకెళుతున్నారు అంటే.. సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయని నిలదీస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో నాంధేడ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. కంప్లయింట్ మా దృష్టికి కూడా వచ్చిందన్నారు చంద్రకాంత్. విచారణ చేస్తున్నాం అని తెలిపారు. పేషెంట్ బంధువుల హడావిడి, కొద్ది సమయం ఆగాలని చెప్పినా వినలేదంటూ సమర్ధించుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates