ఈ డిమాండ్ ఓ మహిళది : మగాళ్ల రక్షణకు కమిషన్ ఉండాలి

nannapaneniమగాళ్ల బాధలు, మగాళ్ల రక్షణపై ఇన్నాళ్లకు ఓ డిమాండ్ వచ్చింది.. మహిళా కమిషన్ ఉన్నట్లే.. పురుషుల రక్షణకూ ఓ కమిషన్ ఉండాలనేది ఈ డిమాండ్. ఇది కూడా ఓ మహిళ గొంతు నుంచి రావటం సంచలనం అయ్యింది. ఇటీవల కాలంలో భార్యల చేతిలో చనిపోతున్న, చిత్రహింసలకు గురవుతున్న మగాళ్ల రక్షణకు ఓ కమిషన్ ఉండాలని గట్టిగా కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. దీనికి కారణాలు కూడా సవివరంగా చెబుతున్నారామె.

నెల రోజుల వ్యవధిలోనే ఉత్తరాంధ్రలో రెండు ఘోరాలు జరిగాయి. పెళ్లయిన వారం రోజుల్లోనే తన భర్తను సుపారీ ఇచ్చి చంపించింది ఓ భార్య. మరో కేసులో పెళ్లయిన 20 రోజుల్లోనే.. బైక్ పై వెళుతూనే భర్తను వెనక నుంచి కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారీ అయింది అతని భార్య. అదే విధంగా వివాహేతర సంబంధాలతో భర్తలపై హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల్లో ఇలాంటి విపరీతమైన నేర ప్రవృత్తి పెరగటానికి టీవీల్లో వచ్చే సీరియల్స్ కారణం అని అన్నారు. సీరియల్స్ కు సెన్సార్ ఉండాలని.. నేర ఇతివృత్తం, కుట్ర, కుతంత్రాలు ఉండే సీన్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళల్లో ఇలాంటి విపరీత ధోరణిలకు కారణాలను గుర్తించి.. వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా.. భార్యలో చేతిలో మోసపోతున్న, చిత్రహింసలకు గురవుతున్న మగాళ్లకు.. ఓ కమిషన్ ఉండాలన్నారు. మహిళా కమిషన్ ఉన్నట్లే.. పురుషుల కమిషన్ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో భార్యల చేతిలో దాడికి గురైన వారిని పరామర్శించి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates