ఈ డీల్ ఓకే : మహేష్ – అల్లు మధ్య కుదిరిన ఒప్పందం

movieప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. వీరిద్దరి లేటెస్ట్ మూవీస్  భరత్ అనే నేను, నా పేరు సూర్య  ఏప్రిల్ 26నే విడుదల కానున్నాయని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదలైతే థియేటర్స్ సమస్యతో పాటు కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పట్టొచ్చని భావించారు నిర్మాతలు. ముఖ్యంగా ఇది ఇండస్ట్రీకి కూడా శ్రేయస్కరం కాదని భావించి పలు చర్చల ద్వారా అండర్ స్టాండింగ్ కి వచ్చారు. రెండు భారీ సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలనే ఉద్ధేశంతో భరత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 20న విడుదల చేస్తున్నారు.

ఇక నా పేరు సూర్య మూవీని మే 4న విడుదల చేయడానికి నిర్ణయించారు. భరత్ అనే నేను చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నా పేరు సూర్య చిత్రాన్ని వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నాడు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతుంది. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు దిల్ రాజు, నాగ బాబు, కెఎల్ నారాయణ సమక్షంలో రెండు సినిమాల నిర్మాతలు ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనే నిర్ణయంతో నిర్మాతలు రెండు వారాల గ్యాప్ లో సినిమాలు విడుదల చేయాలనే నిర్ణయాలని తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates