ఈ తప్పు మళ్లీ చేయం : కేసీఆర్ కు సారీ చెప్పిన టీడీపీ మహానాడు

mahaతెలంగాణలో జరుగుతున్న టీడీపీ మహానాడు.. సీఎం కేసీఆర్ కు సారీ చెప్పింది. ఈ లైన్ చదివి అవాక్కు అయ్యారా.. ఇది పచ్చి నిజం. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ మహానాడు జరుగుతుంది. భారీ ఏర్పాట్లు చేశారు. కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. ఇక్కడే ఓ తప్పు జరిగిపోయింది. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ.. ఆయన పథకాలను విమర్శిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వెటకారాలు ఆడుతూ కళాకారులు పాట పాడటం మొదలుపెట్టారు. పాటలో అసభ్యకర పదాలు ఉండటంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కలుగజేసుకున్నారు. వెంటనే పాటను ఆపించేశారు. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ పాట పాడిన కళాకారులను మందలించారు.

మహానాడు వేదికపై ఇలాంటి పాట పాడినందుకు టీడీపీ తరపున క్షమాపణ చెప్పారు. ఇలాంటి పాట పాడాల్సింది కాదని.. ఇలాంటి వాటికి టీడీపీ వ్యతిరేకం అని సభా ముఖంగా వెల్లడించారు. వేదిక నుంచే మన్నించాలని కోరారు ఎల్.రమణ. తప్పులు చేసి ఉంటే.. ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఇలాంటి పదాలతో పాట పాడిన కళాకారులను.. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఇలాంటి పాట పడినందుకు చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు ఎల్.రమణ.

Posted in Uncategorized

Latest Updates