ఈ దారి స్మార్ట్ ఫోన్ల యూజర్లకు మాత్రమే

చేమునాతకాలం పరిగెడుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది. దీనికి తోడు చేతిలో స్మార్ట్ ఫోన్…చెవిలో ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు ఏజ్ సంబంధం లేకుండా అంతా…చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. అంతగా అలవాటు అయిపోయారు మొబైల్స్ కి. అసలు ఈ ప్రపంచంతో పని లేనట్లు..స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతుంటారు. ఇంకొంత మందయితే సెల్‌ఫోన్‌ చూస్తూ భోజనం చేస్తే… మరికొందరు సెల్‌ఫోన్ చూస్తూ నడుస్తారు. ఇంది ప్రమాదమో చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గమనించిన  చైనా లోని షియాన్ నగర అధికారులు ఫుట్ పాత్ తరహాలో స్మార్ట్ ఫోన్ వాకర్ల కోసం స్పెషల్ గా స్మార్ట్ ఫాత్ ను ఏర్పాటు చేశారు. షియాన్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే యాంటా రోయాన్ ప్రాంతంలో ఈ ప్రత్యేక లైన్ ను నిర్మించారు

80 సె.మీ. వెడల్పు, 100 మీ. పొడవు తో ఏర్పాటు చేసిన రోడ్లపై …ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో స్మార్ట్ ఫోన్ల బొమ్మలు వేశారు. దీంతో ఫోన్ వినియోగదారులను ప్రమాదాల బారి నుంచి కాపాడవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వాకర్ల కోసం ప్రత్యేక  మార్గాన్ని  ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. అంతకు ముందు చైనా లోని చాంగ్ కింగ్ సిటీలో ఇదే తరహాలో స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలోచన ఫోన్ ప్రియులపై ఏమాత్రం ప్రభావం చూపడంలేదట. ఫోన్ లోనే చూస్తూ…తమ కోసం స్పెషల్ గా వేసిన స్మార్ట్ ఫాత్ లను కూడా పట్టించుకోవడంలేదంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates