ఈ నగరానికి ఏమైంది : సాయంత్రం అయ్యిందా.. మద్యంలో మునిగి తేలాల్సిందే

ee nagaranikemaindiసురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ పై పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న మూవీ ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం (జూన్-10) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. ఓ నలుగురు స్నేహితుల మధ్య జరిగే స్టోరీ ఆధారంగా గోవా అందాలు జోడించి.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

పక్షలు సాయంత్రానికల్లా గూడాలకు ఎలా చేరుకుంటున్నాయో మనం కూడా తప్పకుండా మద్యపానంలో మునిగితేలాస్తిందే అని డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ మూవీకి వివేక్‌ సాగర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. చిన్న సినిమాగా వచ్చి, సెన్సేషనల్ క్రియేట్ చేసిన పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించడం, అందులోనూ సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ కావడం ఈ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. సినిమాకి టైటిల్ కూడా కలిసొస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి ఈ సినిమా పెళ్లి చూపులు లాగే ఆకట్టుకుని, ఈ డైరెక్టర్ కి మరో హిట్ ఇస్తుందో లేదో.


Posted in Uncategorized

Latest Updates