ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో అమిత్ షా ఎన్నికల సభ

హైదరాబాద్ : ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర బీజేపీ ఊపునిస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి… పార్టీకి ప్రజల మద్దతు కోరాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు. ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకులతో బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడైంది. ప్రధానమంత్రి దాదాపు మూడు సభల్లో పాల్గొంటారని సమాచారం. ఈలోపే… తెలంగాణలో పార్టీ ప్రచారానికి ఊపునివ్వాలని అమిత్ షా భావిస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్న అమత్ షా… కరీంనగర్ లో మరో బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కరీంనగర్ లో ఈ నెల(అక్టోబర్) పదో తేదీన ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలని.. తాను ఆ సభలో పాల్గొంటానని అమిత్ షా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు చెప్పారు. అమిత్ షా కరీంనగర్ లో పర్యటనను ఖరారు చేసినట్టు లక్ష్మణ్ మీడియాకు వివరించారు. ఈ సభకు లక్ష్మణ్ నాయకత్వం వహించనున్నారు. రాష్ట్ర పార్టీ కీలక నాయకులు పాల్గొనబోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates