ఈ నెల 27న మగ్గం..తెలంగాణ వస్త్ర షో

హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో ఈ నెల 27న మగ్గం.. తెలంగాణ వస్త్ర ప్రదర్శన జరుగనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ ఎం.రాజమహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ కార్పొరేట్, లేటెస్ట్ ఫ్యాషన్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత కళాకారులు రూపొందించిన అనేక ఉత్పత్తులను ప్రపంచానికి చాటేలా ఈ వస్త్ర ప్రదర్శన ఉంటుందన్నారు.

ఈ షోలో కొందరు మోడల్స్ చేనేత బట్టలు ధరించి ర్యాంప్‌వాక్ చేయనున్నారు. గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని చేనేత వస్ర్తాల తయారీ దారులకు చేయూతనందించే ఉద్దేశంతో సీబీఎండీ సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది. 27న సాయంత్రం 5 గంటలకు ఎన్ కన్వెన్షన్‌లో జరిగే ఈ మగ్గం.. తెలంగాణ వస్త్ర ప్రదర్శనకు కేంద్ర మంత్రులు చేనేత జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ హాజరు కానున్నారు. లేటెస్ట్ ట్రెండ్స్, ఫ్యాషన్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత కళాకారులు ఆధునిక డిజైన్లను ఎలా రూపొందిస్తున్నారనే విషయం ప్రపంచానికి చాటేలా ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates