ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్ డౌన్

హైదరాబాద్: ఇవాళ్టి జనతా కర్ఫ్యూలో ప్రజలు అద్భుతంగా సహకరించారన్నారు సీఎం కేసీఆర్. మనకోసం మనం, జనం కోసం మనం అందరి కోసం అందరం..ఇవాళ చూపిన క్రమశిక్షణ మార్చి 31 వరకు చూపాలన్నారు. అందరికి మంచి కోసమే ఈ నెల 31 వరకు తెలంగాణ మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందన్నారు. ఐదురుగు మించి ఎవరూ గుమ్మిగూడొద్దని.. ఇంటి అవసరాలకు కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు సేకరణకు కుటుంబానికి ఒకర్నిమాత్రమే బయటకు అనుమతి ఉంటుందన్నారు. వెళ్లినప్పుడు రెండు మూడ్రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలన్నారు. ఈ రోజు మాదిరిగానే క్రమశిక్షణగా పాటించాలని..పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంతా క్లోజ్ అన్నారు. ఆటోలు, క్యాబ్స్, బస్సులు, మెట్రో అంతా బంద్ అని..రెక్కాడితే డొక్కాడని ప్రజల ఆకలి బాధ చూడొద్దన్నారు.

గర్భిణులకు సమస్యలు లేకుండా చూడాలి. ప్రసవాలకు ఏర్పాట్లు చేస్తాం. అత్యవసరం కాని ఆరోగ్య సేవలు బంద్. స్వీయ నియంత్రణ పాటించాలి. మనల్ని మనం రక్షించుకోవానికి ఏకం కావాలి. ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమితం కావాలి. జనం గుమ్మిగూడకూడదు. అన్ని రాష్ట్రాలతో సరిహద్దులు మూత. మందులు, కూరగాయలు, అత్యవసర సరుకులు తెచ్చే వాహనాలకు మాత్రమే అనుమతి. ప్యాసింజర్ వాహనాలు బంద్. ప్రైవేటు కారు, ట్యాక్సీ ఏదైనా రానీయం.  పౌరులందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంట్లోనే ఉండండి

మీడియాకు అనుమతి

ప్రింట్, ఎలక్ట్రికల్ మీడియాకు అనుమతి. హైదరాబాద్, ముంబై బాగా లాక్ డౌన్ చేశాయని జాతీయ మీడియాలో వచ్చింది. ఈ కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి పనులు చూసుకోండి. ఆ మహమ్మారి బారినుంచి కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు సీఎం కేసీఆర్.

Latest Updates