ఈ నెల10న హైదరాబాద్ కు CEC టీం

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మిజోరం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఢిల్లీలో సమావేశమయ్యారు. సమావేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితా తయారీ, EVMలు సిద్ధం వంటి కీలక అంశాలపై CEC చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు గల పరిస్థితులను వివరించారు. మరో వైపు ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తుది విచారణ పూర్తయ్యే వరకూ ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని ఆదేశించిన క్రమంలో దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న CEC బృందం హైదరాబాద్‌ వచ్చే అవకాశముంది. తర్వాత ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates