ఈ పాపం ఎవరిది : కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య

police-hyderabadసరిగ్గా వారం రోజుల క్రితం.. ఓ కానిస్టేబుల్ రాసలీలలు, పరాయి భార్యతో వివాహేతర సంబంధం అంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. ఇద్దరూ భార్యభర్తల్లా తిరుగుతున్నారని.. వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నారని మహిళ భర్త కొన్ని ఫొటోలు లీక్ చేశాడు. ఆ తర్వాత కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో భారీ కథనాలు వచ్చాయి. కానిస్టేబుల్ తో ఇంటర్వ్యూలు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన పంచాయితీని.. పబ్లిక్ చేశాడు మహిళ భర్త. ఇది కుటుంబ వ్యవహారం అని చూడకుండా నలుగురికీ తెలిసే వార్త కథనాలు వచ్చేశాయి. వారం రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు కానిస్టేబుల్ సందీప్ కుమార్ (28). ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.

సందీప్ కుమార్ ఆత్మహత్య సంచలనం అయ్యింది. మౌలాలి రైల్వేట్రాక్ పై రైలు కింద పడి చనిపోయాడు. మొఘల్ పుర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లయిన ఓ అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళ కూతురితో కలిసే ఉంటున్నాడు. దీనిపై మహిళ భర్త రోడ్డుకెక్కటంతోపాటు.. కానిస్టేబుల్ పై కేసు పెట్టాడు. వారం రోజులుగా వివాదం నడుస్తుంది. దీంతో తీవ్ర మనోవేదనతో.. ఇవాళ ఉదయం సందీప్ రైలు కింద పడి చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. సందీప్ కుమార్ ను చంపిన పాపం ఎవరిది..

Posted in Uncategorized

Latest Updates