ఈ ప్లాన్ పాక్ దే : డ్రోన్లతో డ్రగ్స్ సరఫరా

DRONE DRUGపాక్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. హత్యలు, బాంబుదాడులు, దొంగకాల్పులు చేయడంలో పాక్ కు మించిన దేశం మరోకటి లేదనే విషయం తెలిసిందే. ఇప్పుడు గట్టుచప్పుడుగా డ్రగ్స్ సరఫరా చేసి, మరోసారి వార్తల్లో నిలిచింది.

డ్రోన్ కెమెరాలతో సీక్రెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ స్మగ్లర్లని భారత జవాన్లు గుర్తించారు. ఇంతకుముందు బస్సుల్లో, ట్రైన్స్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..టైట్ సెక్యూరిటీ కారణంగా స్మగ్లర్ల ఆటలు సాగటంలేదు. దీంతో టెక్నాలజీని ఉపయోగిస్తున్న స్మగ్లర్లు ఇలా డ్రోన్ కెమెరాలతో కొన్నిరోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సరిహద్దుల్లోని జవాన్లు వీరిపై కన్నేసి చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. పంజాబ్ సరిహద్దు గ్రామాలకు పాక్ నుంచి డ్రోన్ల సాయంతో డ్రగ్స్‌ ను సరఫరా చేస్తుండగా భారత సరిహద్దు దళం(BSF) జవాన్లు గుర్తించారు.

సరిహద్దు గ్రామం గురుదాస్‌ పూర్‌ లో డ్రోన్‌ ను కనుగొన్నామని BSFకు చెందిన నిఘా విభాగం తెలిపింది. ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ లో డ్రగ్స్ ప్యాక్ చేసిన సంచిని డ్రోన్‌ కు కట్టారని.. అది 200 మీటర్ల ఎత్తులో ఎగరడాన్ని గమనించామని వెల్లడించింది. దాన్ని పసిగట్టడంతో ఆ ప్యాక్‌ ను డెలివరీ చేయకుండానే తిరిగి పాక్‌ వైపు వెళ్లిపోయిందని తెలిపింది. బోర్డర్‌ లో సహారన్, చండీఘడ్ ఔట్‌ పోస్ట్‌ల సమీపంలో డ్రోన్‌ ను గుర్తించామని, అయితే..డ్రోన్ పైన ఉండగా డ్రగ్స్ ముక్కలు కిందపడ్డాయని దీంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కన్ఫామ్ అయ్యిందని చెప్పింది BSF.

Posted in Uncategorized

Latest Updates