ఈ బుడ్డోడు అపర మేధావి : కథలు వినే వయస్సులో పుస్తకమే రాశాడు

gogoyమాటలు నేర్చుకునే వయసులో చిన్న, చిన్న కథలు రాశాడు. పెన్ను పట్టుకోవడం చేతకాని ప్రాయంలో.. రంగురంగుల బొమ్మలేసి ఆశ్చర్యపరిచాడు. అసోంలోని లఖీంపూర్‌కు చెందిన నాలుగేళ్ల ఆయాన్‌ గొగొయ్‌ గొహైన్‌ ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తున్నాడు. నాలుగేళ్లలోనే పొట్టి కథల పుస్తకం రాసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నాడు. ఈ చిన్నోడిని భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన రచయితగా గుర్తింపు కూడా దక్కించుకున్నాడు.

ఉత్తర లఖీంపూర్‌కు చెందిన గొహైన్‌ ఏడాది వయసులోనే బొమ్మలేయడం ప్రారంభించాడు. మూడేళ్లకు కథలు రాయటం మొదలుపెట్టాడు. మాటలు, రంగులు, రుచులు, శబ్దాలను నిశితంగా పరిశీలిస్తుంటాన్ని గుర్తించాడు చిన్నారి తాతయ్య పూర్ణకాంత గొగొయ్‌ చెప్పారు. ఇలా 30 చిట్టికథలతో ‘హనీకూంబ్‌’ పేరుతో గొహైన్‌ 2018 జనవరిలో పుస్తకం రాశాడు. ఇందులోని కథలకే కాకుండా.. పుస్తకం ఫస్ట్ పేజీ డిజైన్ కూడా తానే తయారు చేశాడు. దీని ఖరీదు రూ.250. తల్లిదండ్రులు మిజోరాంలో ఉంటే… చిన్నారి మాత్రం తాతయ్య, బామ్మతో కలిసి లఖీంపూర్‌లోనే ఉంటున్నాడు. రోజూ ఏదో ఒకటి రాయడం, బొమ్మలు వేయడం నేర్పుతారు మా తాతయ్య. ఆయనే నా హీరో.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. నా చాక్లెట్‌ మాన్‌ అంటున్నాడు గొహైన్‌.

నా మనవడికి మంచి కళా దృష్టి ఉంది. యోగా అంటే ఇష్టం. కార్టూన్స్‌ చూస్తాడు.. పెద్దయ్యాక అద్భుతాలే చేస్తాడు అంటూ మురిసిపోతున్నాడు తాతయ్య పూర్ణకాంత గొగొయ్. ప్రముఖ కవి దిలీప్‌ మహాపాత్ర, నార్త్‌ కరొలినాకు చెందిన రచయిత్రి జొయాన్‌ లియోటా హనీకూంబ్‌ పుస్తకాన్ని సమీక్షించారు.

Posted in Uncategorized

Latest Updates