ఈ మట్టి మనిషి..ఆ మట్టిలోనే కన్నుమూశాడు

formerవర్షాకాలం ప్రారంభం కావడం…తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం కోసం … భూమిని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన అన్నదాత పంపరి బాలరాజు తన వ్యవసాయ పొలం సాగు పనులల్లో నిమగ్నమయ్యాడు. వర్షాలు భాగా కురవడంతో ఈ ఏడాది పంట బాగా పండుతుందని సంతోషంతో వరి నాట్లు కూడా వేయించాడు. మరి కొద్ది భూమిలో కూడా వరి నాట్లు వేయించడానికి బురద పొలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే… అనుకోకుండా…ఆ పొలంలోనే ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు బాలరాజు. విషయం తెలుసుకున్న తోటి రైతులు వచ్చి ..చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు అభిప్రాయ పడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates