ఈ రాత్రికి రాక : శ్రీదేవి భౌతికకాయం అప్పగింత

sreedeviమూడు రోజుల తర్వాత శ్రీదేవి భౌతికకాయం మార్చురీ నుంచి బయటకు వస్తోంది. దీనికి సంబంధించిన క్లియరెన్స్ లేఖ భారత కాన్సులేట్ కు అందించింది దుబాయ్ ఎంబసీ. ఈ లేఖ కుటుంబ సభ్యులకు అందించారు అధికారులు. ప్రస్తుతం ఈ లేఖతో మార్చురీ నుంచి శ్రీదేవిని ఎంబాల్మింగ్ కు ప్రక్రియకు తరలించనున్నారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ కావటానికి కనీసం రెండు గంటల సమయం పట్టనుంది. అంటే ఈ సాయంత్రం 5 గంటలకు ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసురానున్నారు. జర్నీ సమయం మూడు గంటలు పడుతుంది. అంటే ఈ రాత్రి 9, 10 గంటలకు ముంబై చేరుకోనుంది శ్రీదేవి భౌతికకాయం..


Posted in Uncategorized

Latest Updates