ఈ రూట్లలో ట్రాఫిక్ ఇక్కట్లు : సిటీలో నీళ్లు నిలిచిన ప్రాంతాలు ఇవే

rain-waterహైదరాబాద్ లో ఒక్కసారిగా పడిన భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. నీళ్లను మ్యాన్ హోల్స్ నుంచి పంపిస్తున్నారు. దీనికితోడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలతోపాటు సిటీలో చాలా చోట్ల రోడ్డు పక్కన పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోనూ నీళ్లు నిలిచాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని లోతట్లు ప్రాంతాల్లోకి కూడా నీళ్లు వచ్చాయి.

నీళ్లు నిలిచిన ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి :

ఇందిరాపార్క్, ఓల్డ్ PS సైఫాబాద్, లక్కీ టర్నింగ్ పాయింట్, నిజాం కాలేజీ బ్యాక్ సైడ్, పంజాగుట్ట, కింగ్ కోఠి, హైదర్ నగర్, లక్డీకాపూల్, హైమాక్స్,టోలీచౌకీ, కాచీగూడ క్రాస్ రోడ్, బీవీబీ జంక్షన్, బంజారాహిల్స్, ఎన్టీఆర్ భవన్, మెహదీ ఫక్షన్ హాల్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. నీటిని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు GHMC సిబ్బంది చర్యలు చేపట్టింది.

Posted in Uncategorized

Latest Updates