ఈ రూపంలో దర్శనం : 57 అడుగుల్లో ఖైర‌తాబాద్ మహా గ‌ణ‌ప‌తి

ganeshహైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా దర్శనమివ్వనున్నాడు. 57 అడుగుల ఎత్తు.. 27అడుగుల వెడల్పు తో రూపుదిద్దుకుంటున్నాడు. గత నెల 25న కర్ర పూజ తో అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయకచవితి పండుగకు వారంరోజులముందే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం రూపం పూర్తవుతుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ఆదివారం(జూన్-17) రాత్రి శ్రీసప్తముఖ కాల సర్ప మహాగణపతి రూపం మోడల్‌ను ఆవిష్కరించారు.

శాంత చిత్తంతో ఉన్న ఏడు గణపతి ముఖాలు, 14 చేతులు అందులో కుడి వైపు ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధతో కూడి ఆశీర్వదిస్తుండగా, ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉంటాయి. 57 అడుగుల గణపతికి మరో మూడు అడుగుల ఎత్తులో ఏడు తలల శేషుడు తన పడగతో నీడ కల్పిస్తాడు. వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి. గత ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రెండు వైపులా చిరు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడికి కింద నుంచి కుడి వైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ దేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లు ఆశీనులై ఉంటారు. పాదల దగ్గర ఆయన వాహనం ఎలుక స్వామి వారికి భజన చేస్తూ కనిపిస్తుంది.

గణేశుడికి మరో కుడివైపు ఈ ఏడాది కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ శ్రీనివాసుడి కల్యాణ దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. నిజంగానే పద్మావతి శ్రీనివాసుల కల్యాణం జరుగుతున్నట్లు కళ్లకు కట్టే విధంగా విగ్రహాలను రూపొందిస్తున్నారు. హోమగుండం దగ్గర అమ్మవారి కన్యాదానం తర్వాత శ్రీనివాసుడి చేతిలో ఆమె చేయి పెట్టి అప్పగింతలు చేసిన విధంగా ఆ రూపం నేత్రానందం కలిగిస్తుంది. మరో ఎడమ వైపు 14 అడుగుల ఎత్తులో తలపై గంగతో నందీశ్వరునిపై ఆశీనులైన కుమారస్వామి సహిత శివపార్వతులు దర్శనమిస్తారు.

Posted in Uncategorized

Latest Updates