ఈ లెక్కన జనం పరిస్థితి ఏంటో : కరెంట్ లేక నిలిచిపోయిన అసెంబ్లీ

aaaసాధారణంగా విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ వాయిదా వేయడం మనం ఇప్పటి వరకూ చూశాం. మొదటిసారి కరెంట్ లేక అసెంబ్లీ వాయిదా పడింది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మీరు సాధించింది ఇదేనా అంటూ ప్రభుత్వం విమర్శలు వస్తున్నాయి. అభివృద్ది అంటే ఇదేనేమో, అసెంబ్లీనే సరిగ్గా మెయిన్ టెయిన్ చేయలేని మీరు రాష్ట్రాన్ని ఏం బాగుచేస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గురువారం(జులై-5) నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కుర్తుస్తున్నాయి. నాగ్ పూర్ లోని మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగంణం కూడా నీటిలో మునిగింది. జులై 6వ తేదీ శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కరెంట్ లేకపోవటంతో స్పీకర్ హరిభావ్‌ బగ్దే సభను గంట వాయిదా వేశారు. అప్పటికీ కరెంట్ రాలేదు. దీంతో జనరేటర్ల సాయంతో సభను ప్రారంభించాలనుకున్నారు. మొత్తం అసెంబ్లీని రన్ చేయడం అసాధ్యమని సిబ్బంది తేల్చిచెప్పారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో విద్యుత్ శాఖ కూడా స్పష్టంగా చెప్పలేకపోయింది. దీంతోస్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు.

వర్షపు నీరు నిలిచి ఉండటంతోనే వల్లే.. విద్యుత్‌ సరఫరాని నిలిపివేసినట్లు చెబుతున్నారు అధికారులు. ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి చంద్రశేఖర్‌ బవన్‌ కులే.. వర్షాల కారణంగా అసెంబ్లీ సమావేశాలు ఆగిపోవడం ఇదే తొలిసారి అన్నారు. డ్రైనేజీ సమస్య కారణంగానే అసెంబ్లీ ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివరణపై.. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నాగ్‌ పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని.. ఫలితంగా నేడు అసెంబ్లీ సమావేశాలకే ఆటంకం ఏర్పడిందని శివసేన మండిపడింది. దీనిపై నెటిజన్లు కూడా ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. ఫస్ట్ అసెంబ్లీని డెవలప్ చేసి తర్వాత రాష్ట్రాన్ని డెవలప్ చేయండంటూ ఫడ్నవీస్ సర్కార్ పై సెటైర్లు వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates