ఈ వీకెండ్ బొమ్మ అదిరింది : ఒకే రోజు 11 సినిమాలు విడుదల

చేబుాప్రతి శుక్రవారం సినీ ఇండస్ట్రీకి శుభదినం. ఈ వారం మాత్రం అంటే జూన్ 29వ తేదీ శుక్రవారం మాత్రం సినీ ఇండస్ట్రీలో బొమ్మ అదిరింది అంటున్నారు. ఈ వీకెండ్ చూడటానికి బోలెడు సినిమాలు ప్రేక్షకుల కోసం రెడీ అయిపోయాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలుపుకుని 11 సినిమాలు ధియేటర్లలో సందడి చేయనున్నాయి. తెలుగులోనే తొమ్మిది సినిమాలు విడుదల అవుతుండగా.. వాటిలో రెండు మాత్రం కొంచెం హైప్ క్రియేట్ అవుతున్నాయి.

ఈ నగరానికి ఏమైంది అనే సినిమా మాత్రం కొంచెం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. యూత్ టార్గెట్ గా దీన్ని తెరకెక్కించారు. పెళ్లిచూపులు టీం నుంచి వస్తున్న మూవీ కావటంతో ఆసక్తిగా ఉంది. మిగతా సినిమా లిస్ట్ చూస్తే ఇలా ఉంది.. అల్లు శిరీష్, మోహన్ లాల్ నటించిన యుద్ధభూమి, షకలక శంకర్ హీరోగా నటిస్తున్న శంభో శంకర ఉన్నాయి. వీటితోపాటు కన్నుల్లో నీరూపమే, నా లవ్ స్టోరీ, IPC సెక్షన్ భార్యబంధు, సూపర్ స్కెచ్, సంజీవని, మిస్టర్ హోమానంద్ తెలుగు సినిమాలు ఉన్నాయి.

ఇక హిందీ విషయానికి వస్తే సంజయ్ దత్ బయోపిక్ అయిన సంజూ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్స్, టీజర్స్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. సంజయ్ దత్ పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ తొమ్మిది పాత్రల్లో కనిపిస్తూ మూవీకి అంచనాలు పెంచేశాడు. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎస్కేప్ ప్లాన్ 2 మూవీ కూడా విడుదల కాబోతున్నది. ఇది యాక్షన్ సినిమా. ఇలా మొత్తం 11 సినిమా ఈ శుక్రవారం విడుదల అయ్యి.. ఈ వీకెండ్ అలరించటానికి మీ ముందుకు వస్తున్నాయి..

Posted in Uncategorized

Latest Updates