ఈ శతాబ్దంలోనే అద్భుతం: జూలై 27న సుదీర్ఘ చంద్రగ్రహణం

ఈ నెల 27న ఈ శతాబ్దంలోనే అరుదైన అద్భుతం జరగనుంది. అర్ధరాత్రి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇది చాలా అద్భుతమైన అవకాశమని… ప్రతి ఒక్కరు తప్పక చూడాలని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ  తెలిపింది.  జూలై 27న రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని తెలిపింది.

2000 సంవత్సరం జులై 16న ఒక గంటా 46 నిమిషాలు, 2011 జూన్‌ 15న 1:40 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఏర్పడింది.  భూమికి దగ్గరగా వస్తున్నందున అంగారకుడు అదే రోజున సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

Posted in Uncategorized

Latest Updates