ఈ సిరీస్ లో తానేంటో నిరూపిస్తా : రైనా

RAINAటీమిండియా తరఫున తాను బాగా ఆడినప్పటికీ జట్టు నుంచి తప్పించడం బాధించిందని సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తానేంటో నిరూపించుకునే సమయం వచ్చిందని ఆ అవకాశాన్ని చేజార్చుకోనని రైనా అన్నాడు. తాను బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించడం బాధ కలిగించిందన్న రైనా… ఇప్పుడు తాను యో-యో టెస్టు పాసయ్యానన్నారు. ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని.. ఇన్ని నెలల కఠోర శిక్షణ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఆడాలనే కాంక్ష మరింత బలపడిందన్నాడు. దీన్ని ఇక్కడే వదిలిపెట్టనని.. వీలైనన్ని ఎక్కువ రోజులు భారత్‌కు ఆడాలనేదే తన లక్ష్యమన్నాడు. 2019 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని తెలిపిన రైనా.. ఇంగ్లాండ్‌లో బాగా రాణిస్తానని తెలుసన్నాడు. సఫారీలతో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాననే నమ్మకంతో ఉన్నా అని రైనా తెలిపాడు. ప్రస్తుతం సఫారీలతో టీ20 సిరీస్‌కు జోహాన్నెస్‌బర్గ్ బయలుదేరానని ట్విట్ చేశాడు రైనా. గతేడాది ఫిబ్రవరిలో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో రైనా ఆడాడు. 63 పరుగులతో రాణించిన రైనాకు అదే చివరి మ్యాచ్.

Posted in Uncategorized

Latest Updates