ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి రెండు నెలల గడువు : చంద్రబాబు

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీహామీని అమలు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో విస్తృత స్థాయి నిర్వహించారు చంద్రబాబు. జమిలి ఎన్నికలకు సిద్ధమన్న చంద్రబాబు… ముందస్తుకు సిద్ధంకాదన్న సంకేతాలు ఇచ్చారు. స్వలాభంగా కోసం కేంద్రం ముందస్తుకు సిద్ధమైతే తాము వ్యతిరేకిస్తామన్నారు చంద్రబాబు. దక్షిణాధి రాష్ట్రాలతో సమానంగా ఎదగాలంటే మరో 12ఏళ్లు పడుతుందన్నారు చంద్రబాబు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంపీలందరు గట్టిగా పోరాటం చేస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఉక్కుప్యాక్టరీ కోసం కేంద్రానికి రెండు నెలల గడువు ఇస్తున్నట్లు సమావేశంలో చంద్రబాబు అన్నారు. విశాఖ రైల్వేజోన్ సైతం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates