ఉగాది కానుక : ఇంటింటికీ తెలంగాణ చరిత్ర

ramanaరెండున్నర కోట్ల పుస్తకాలు పంపిణీ

తెలంగాణ చరిత్రను ప్రతి కుటుంబానికీ అందజేయాలనే సంకల్పంతో ‘మన తెలంగాణ – మన చరిత్ర’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందిస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి. బుధవారం సచివాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణతో కలిసి వెల్లడించారు ఆయన. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 18 నుంచి ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. 2.5 కోట్ల పుస్తకాలను ముద్రిస్తున్నామని, ఇందులో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలతో పాటు కవులు, కళాకారులు, రచనలు, రాజులు, రాజరికాలు, కోటలు, తెలంగాణ సామెతలు ఇలా అన్ని అంశాలనూ పొందుపరుస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో జరిగే జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లోనూ తెలుగు వినిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి సమావేశంలో ప్రారంభ వ్యాఖ్యలు తెలుగులో మాట్లాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రమణాచారి.

Posted in Uncategorized

Latest Updates