ఉగ్రచర్య: IAS శశాంక గోయల్ కుమారుడి దారుణ హత్య

shashank-goyalIAS అధికారి శశాంక్‌ గోయల్‌ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఫ్రెండ్స్ తో కలిసి టర్కీ పర్యటనకు వెళ్లిన ఆయన కుమారుడు శుభమ్‌ గోయల్‌(24) అక్కడ జరిగిన ఘర్షణలో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

శశాంక్‌ గోయల్‌ ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందినవారు తెలంగాణలో కార్మిక, ఉద్యోగ నైపుణ్య, పరిశ్రమల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శుభమ్‌ గోయల్‌ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు. న్యూఢిల్లీలో ఓ పెళ్లికి హాజరైన శుభమ్‌.. స్నేహితులతో కలసి టర్కీ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. శుభమ్‌ మరణవార్త ఈ నెల 26న కుటుంబసభ్యులకు తెలిసినట్లు సమాచారం.శుభమ్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అంత్యక్రియల కొరకు అతని మృతదేహాన్ని సొంతవూరు రూర్కీకి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates