ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలి: మోడీ

modiభారత్‌కు షాంఘై కార్పోరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాల పర్యాటకులను రెట్టింపు చేయాలన్నదే లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండో రోజు చైనాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన SCO దేశాల నుంచి కేవలం 6 శాతం పర్యాటకులే భారత్‌కు వస్తున్నారన్నారు. ఉమ్మడి సంప్రదాయాలపై అవగాహన ద్వారా పర్యాటకులకు రెట్టింపు చేస్తామన్నారు. ఎస్‌సీవో దేశాలతో అనుసంధానం కావడానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఉగ్రవాద ప్రభావానికి లోనైన దేశం అఫ్గనిస్తాన్ అన్నారు. అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ఘని సరైన చర్యలు చేపడతారని ఆశిస్తున్నానన్నారు. భారత్‌లో బుద్దిస్ట్‌ ఫెస్టివల్‌, SCO ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని, ఎస్‌సీవో దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. SCO సదస్సులో అందరూ కలిసి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.

SCO దేశాల సిల్వర్‌ జూబ్లీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. సదస్సులో ప్రధాని మోడీ సెక్యూర్‌ పదానికి అర్థం విడమర్చి చెప్పారు. ‘ఎస్‌’ అంటే పౌరులకు భద్రత అని, ‘ఈ’ అంటే ఆర్థిక అభివృద్ధి అని, ‘సీ’ అంటే అనుసంధానత, ‘ఆర్‌’ అంటే సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, ‘ఈ’ అంటే పర్యావరణ పరిరక్షణ అని తెలిపారు  ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates