ఉగ్రవాదుల బెదిరింపులు: 40 మంది పోలీసులు రాజీనామా

కశ్మీర్‌ రాష్ట్రంలోని షోపియాన్‌ జిల్లాలో గత శుక్రవారం ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్‌ పోలీసు అధికారులను వారి ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసులను టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా.. చస్తారా’ అని బెదిరించడంతో 40 మంది SPO లు రాజీనామా చేసినట్లు తెలిసింది. పోలీసు అధికారులు రిజైన్‌ చేయడమే కాక ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.

దీనిపై స్పందించిన హోం శాఖ  తీవ్రంగా ఖండించింది.. వీడియోల్లో ఉన్న వారు అసలు ఎస్పీవోలే కాదని ప్రకటించింది. ఒక వేళ వారు నిజంగా పోలీసు అధికారులైనా.. కేవలం 40 మంది రాజీనామాలతో తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది SPO లున్నారని వారితో పోల్చుకుంటే రాజీనామా చేసినవారు చాలా తక్కువన్నారు.

మరోవైపు మరిన్ని రాజీనామా వీడియోలో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాడానికి వీలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం దక్షిణ కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది.

 

 

Posted in Uncategorized

Latest Updates