ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలి: మోడీ

MODIప్రజలను రక్షించేందుకు… ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత్-బ్రిటన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, థెరెసా మే నిర్ణయించారు. లష్కరే తయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్ వర్క్, అల్ ఖాయిదా, ISIS వాటి అనుబంధ సంస్థలపైనా యాక్షన్ తీసుకోవాలన్నారు. అమాయకులను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నెట్ వర్క్ లు, వాటి ఆర్థిక వనరులను దెబ్బకొట్టేందుకు అన్ని దేశాలు పనిచేయాలన్నారు. భారత బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టి పరారై లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యా వ్యవహారంపైనా మోడీ-థెరెసా చర్చించినట్టు సమాచారం.

లండన్ లో పర్యటిస్తున్న మోడీ… బ్రిటీష్ ప్రధానమంత్రి థెరెసా మేతో చర్చలు జరిపారు. ఇద్దరు లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. భారత్-UK ప్రజల కోసం మనం కలిసి పనిచేద్దామని మోడీతో అన్నారు థెరెసా మే. ఈ మీటింగ్ తో భారత్-UK సంబంధాలకు కొత్త శక్తి వస్తుందన్నారు మోడీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ UK భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు మోడీ. ఇది వాతావరణ మార్పులపై యుద్ధం మాత్రమే కాదని… భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత అన్నారు. బసవేశ్వరుడి జన్మదినాన లండన్ లోని ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉన్నారు మోడీ.

తర్వాత వేల్స్ యువరాజు చార్లెస్ తో సమావేశమయ్యారు. ఇద్దరు కలసి సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్లారు. మోడీని ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. మోడీని కలిసేందుకు ప్రవాస భారతీయులు, లండన్ లోని భారత సంతతి ప్రజలు పోటీపడ్డారు. మోడీ సెల్ఫీలు తీసుకున్నారు. రోడ్లపై ఫ్లాష్ మాబ్ లతో అలరించారు NRI మహిళలు.

Posted in Uncategorized

Latest Updates