ఉచితంగా కళ్లజోళ్లు : పరీక్షించి ఇస్తారు

downloadరాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన వారికి డాక్టర్ల సూచనలతో కళ్లద్దాలు కూడా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. శనివారం (ఫిబ్రవరి-3) ప్రగతిభవన్‌లో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించనున్న ఈ నేత్ర శిబిరాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. నేత్ర వైద్య శిబిరాల బాధ్యతను.. ప్రజాప్రతినిధులకు అప్పగించారు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ డాక్టర్లతో పాటు.. అవసరాన్ని బట్టి పొరుగు రాష్ట్రాల్లోని కంటి వైద్య నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates