ఉజ్జయిని అమ్మవారి దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు : మంత్రి తలసాని

ప్రజలందరు సంతోషంగా ఉజ్జయిని అమ్మవారి దర్శించుకోవడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశామన్నారు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు జరగకూడదని గత వారం రోజుల నుంచి ఇక్కడ తానే స్వయంగా  ఏర్పాట్లు చేయించానన్నారు తలసాని. సీఎం గొప్ప దైవభక్తుడు కావడం వల్ల భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా సికింద్రాబాద్ జనరల్‌ బజార్‌ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయ బోనాల జాతరకు అవసరమైన నిధులు కేటాయించారని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న(ఆదివారం) తొలిపూజలో పాల్గొని ఉజ్జయినీ మహంకాళి, మాణిక్యాలమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం తలసాని దంపతులు మహంకాళికి బోనాలు సమర్పించి జాతరను ప్రారంభించారు. సోమవారం రంగంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించినానంతరం తలసాని భక్తులను ఉద్ధేశించి ప్రసంగించారు.

Posted in Uncategorized

Latest Updates