ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి  ఆలయానికి చేరుకుని ..అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి… పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు.

సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

అంతకుముందు  ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఆ తర్వాత ఆదయ్యనగర్‌ కమాన్‌ దగ్గర నుంచి ఎంపీ కవిత బంగారు బోనంతో వచ్చి మహంకాళి అమ్మవారికి సమర్పించారు.

Posted in Uncategorized

Latest Updates