ఉజ్జయిని మహంకాళి జాతర: ఇవాళ రంగం

ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా నిర్వహించే రంగం ఇవాళ( సోమవారం,జూలై-30) జరగనుంది. ఉదయం స్వర్ణలతం భవిష్యవాణి వినిపిస్తారు. ఈ సందర్భంగా భక్తులు అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెబుతారు.

లష్కర్ బోనాలకు జనం పోటెత్తారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు  వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం(జూలై-29) ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మవారికి బోనాల సమర్పణ కొనసాగుతూనే ఉంది. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని.. అమ్మకు సమర్పించేందుకు వేలాది మంది మహిళలు గుడికి వచ్చారు. ఐదు లైన్లలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. సీఎం సహా రాజకీయ నాయకులు, సినీ , పారిశ్రామిక ప్రముఖులు అమ్మను దర్శించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates