ఉత్కంఠకు తెరపడింది: సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా

yedurappa-rదేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ లంచ్ విరామం తరువాత మధ్యాహ్నాం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది. సభ ప్రారంభం తరువాత తనకు సీఎంగా అవకాశం ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ కి ధన్యవాదాలు తెలిపారు యడ్యూరప్ప. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతోనే… విశ్వాస పరీక్ష జరుగక ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2 రోజుల 7 గంటల సీఎంగా యడ్యూరప్ప కొనసాగారు. ప్రసంగ సమయంలో యడ్యూరప్ప ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీని ఆశీర్వదించిన 6.5 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన సుపరిపాలన కారణంగానే40 సీట్లు ఉన్నబీజేపీకి 104 సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నారు. కాంగ్రెస్ పై వ్యతిరేకతోనే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ని ప్రజలు తిరస్కరించారన్నారు. అవకాశవాదంతోనే కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసాయన్నారు. రైతుల, బడుగులు సంక్షేమం కోసం తాను పోరాడుతూనే ఉన్నానన్నారు యడ్యూరప్ప. రైతుల పరిస్ధితి అద్వానంగా మారిందన్నారు. రైతు కన్నీరు తుడవడం ఎవరివల్లా కావడం లేదన్నారు.కాంగ్రెస్, జేడీఎస్ లు చేస్తున్న పనులను టీవీల్లో చూసిన ప్రజలు మనం ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఉన్నామా అని అనుకుంటున్నారన్నారు. స్వాత్రంతం వచ్చిన తరువాత కూడా మంచి నీటి కోసం కొట్లాడుకుంటున్నామన్నారు. జీవితం చివరి వరకూ పోరాడుతూనే ఉంటానన్నారు. చివరి శ్వాస వరకూ ప్రజల కోసమే తన పోరాటమన్నారు యడ్యూరప్ప.

Posted in Uncategorized

Latest Updates