ఉత్తమ్, కోదండరాంలకు హరీష్ ఓపెన్ లెటర్

హైదరాబాద్ : తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు మంత్రి హరీష్. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి  బహిరంగ లేఖ రాశారు హరీష్. సాగునీటి రంగం, ఆస్తుల పంపకం, హైకోర్టు విభజన సహా అనేక అంశాలపై చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. ఆయనపై ఆధారపడిన ప్రభుత్వం తెలంగాణలో వస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులు పెట్టుకుంటోందని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి 12 ప్రశ్నలతో కూడిన లేఖను విడుదల చేస్తూ.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు మంత్రి హరీష్. చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని లేఖలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిపారు మంత్రి హరీశ్‌రావు. మరోవైపు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కు మరో బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. ఉద్యమ సమయంలో ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా టీఆర్ఎస్, కోదండరామ్ కలిసే ఉన్నారని.. ఇప్పుడు తెలంగాణ ద్రోహులతో కలిసిపోవడం ఉద్యమ స్ఫూర్తికి ద్రోహం కాదా అని అడిగారు.

 

Posted in Uncategorized

Latest Updates