ఉత్తరప్రదేశ్‌ లో భారీ వర్షాలు : 33 మంది మృతి

ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ తో పాటు హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి. యూపీలో కురుస్తున్న భారీ వర్షాలు, పిడుగుపాటుకు 33 మంది మృతి చెందారు. ముజఫర్‌నగర్, ఆగ్రా, కాస్‌గంజ్, మీరట్ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు, పురాతన కట్టడాలు కూలిపోయాయి. ఈ ప్రాంతాల్లో తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

Posted in Uncategorized

Latest Updates