ఉత్తరాంధ్ర మరో తెలంగాణ ఉద్యమం అవుతుంది : పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్ర-మరో-తెలంగాణ-ఉద్యమం-అవుతుందిఆంధ్రప్రదేశ్ లో భాగమైన ఉత్తరాంధ్ర మరో తెలంగాణ కావడానికి మరెంతో దూరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ట్విట్టర్ పెట్టిన కామెంట్ కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రపై ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే.. మరో తెలంగాణ కావటానికి ఎన్నో సంవత్సరాలు పట్టదని అభిప్రాయపడ్డారు పవన్. ఆత్మగౌరవం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమించే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇటీవల 15 రోజులు ఉత్తరాంధ్రలో పర్యటించి.. ప్రజలను దగ్గర నుంచి చూశానన్నారు. యువతలో ఆవేశం, కసి కనిపిస్తున్నాయన్నారు. ఏపీ రాష్ట్ర నేతల అధికార దాహానికి, అణచివేతను భరించలేక పుట్టిందే తెలంగాణ ఉద్యమం అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల్లో అప్పటి తెలంగాణ యువతలోని కసి, కోపం కనిపిస్తున్నాయని.. ఇది ఉద్యమంగా మారటానికి ఎన్నో సంవత్సరాలు పట్టదన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రత్యే రాష్ట్ర సాధన దిశగా వెళ్ల ప్రమాదం ఉందన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వరస ట్విట్లు ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates