ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు….ముంబై, భువనేశ్వర్ లో హై అలర్ట్

rainదేశంలో నైరుతీ ప్రభావం కనిపిస్తోంది. రుతుపవనాల విస్తరణలో దేశంలో చాలాచోట్ల మంచి వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో జోరు వానలు పడుతున్నాయి. ముంబైలో నిన్న రాత్రినుంచి కురుస్తున్న వాన బీభత్సం సృష్టించింది. వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు చనిపోయారు. ముంబై, భువనేశ్వర్ తీరప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు
ఉత్తరాదిన వర్షాల జోరు కొనసాగుతోంది. గుజరాత్ లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ హైవే పైనా భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు, సరుకు రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. భిలాద్, సంజన్ మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ట్రాక్ దెబ్బతిన్న ఏరియాల్లో రిపేర్ పనులు చేస్తోంది రైల్వేశాఖ. కొన్ని రైల్వే సర్వీసులను దారిమళ్లించారు. వర్షాలు, వదలతో వల్సాద్ జిల్లాలోని అంబర్గావ్ పట్టణం మొత్తం నీటమునిగింది.
ఇక ముంబైలోనూ ఇదే పరిస్థితి. నిన్న రాత్రి నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, లోకల్ రైళ్లు చాలావరకు రద్దుచేశారు. రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. నగరంలో చాలా చోట్ల రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దక్షిణ ముంబయిలోని వడాలా ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో పదివరకూ కార్లు ధ్వంసమయ్యాయి.
వర్షప్రభావం ముంబైలోని అంధేరి, ఖర్ , మలద్ ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్లు జలమయమైన ఫొటోలను… ముంబయి వాసులు సోషల్ సైట్లలో పెడుతున్నారు. వర్షాలు, వరదలతో నలుగురు వ్యక్తులు చనిపోయారు.
పశ్చిమబెంగాల్ లో కూడా మంచివానలే పడుతున్నాయి. రాజధాని కోల్ కతా నగరం రోడ్లనీ వర్షపునీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. దీంతో బాధితులకు రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రజలకు ఇబ్బది లేకుండా వాటర్, ఫుడ్ సప్లై చేస్తున్నారు అధికారులు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కాస్త బలహీనపడ్డాయి. ఇవాళ రేపు పరిస్థితి ఇలాగే ఉంటుందనీ, ఎల్లుండి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు వాతవరణ అధికారులు. ఇక దేశంలో రుతుపవనాలు చాలాచోట్లకు విస్తరించాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, విదర్బ, బీహార్, జార్ఖండ్, యూపీలోనూ వాతావరణం మారింది.

Posted in Uncategorized

Latest Updates