ఉత్తరాదిన దంచికొడుతున్న వానలు

RAINఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం (జూన్-28) ఢిల్లీ, యూపీ, రాజస్థాన్ , హర్యానా, ఛత్తీస్ ఘడ్ లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు యూపీ మధురలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ బ్రిడ్జి కింద వర్షపు నీటిలో వాహనం ఆగిపోయింది. దీంతో అందులోని వారు భయంతో వణికిపోయారు. స్థానికులు వరద నీటిలో వెళ్లి వాళ్లను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు.

Posted in Uncategorized

Latest Updates