ఉత్తరాదిలో భారీ వర్షాలు…స్ధంభించిన జనజీవనం

ఉత్తరాదిలో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్ లోని నవ్ సరి జిల్లాలో నిన్న 178మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సూరత్, వడోదర, అహ్మదాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షాల ధాటికి ఎక్కడికక్కడ జనజీనం స్ధంభించింది. పలు ఏరియాలు నీటాలో మునిగిపోయాయి. మరో ఐదు రోజుల పాటు గుజరాత్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.

మధ్యప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. రాజధాని భోపాల్ లో 11 సెంటీమీటర్లు, ఖండ్వా, ఇండోర్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 15 సెంటీమీటర్ల వాన కురిసింది. దక్షిణాదిలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. కేరళలో అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం, వయనాడ్, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో వరద పరిస్థితుల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలో నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగి ఎక్కడికక్కడ జనజీవనం స్ధంభించిపోయింది. ముంబైలో అయితే రోడన్లీ చెరువులను తలపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates