ఉత్తర భారతంలో మళ్లీ వర్ష బీభత్సం

delhi-rainఉత్తర భారతంలో మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉహించని పరిస్థితులు అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ నగరంలో భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు నగరంలోని కొన్ని ప్రాంతాలు వణికిపోయాయి. ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ఇదే రకమైన వాతావరణం నెలకొంది. నారనౌల్, అల్వార్, రోహతక్, జింద్, భివాని, జాజర్, రెవారి, నుహ్, పల్వాల్ ప్రాంతాల్లోనూ పెనుగాలులు వీచడంతో  భయానక వాతావరణం ఏర్పడింద. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇవాళ ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్థానిక ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. పవర్ లేదా టెలిఫోన్ లైన్ల వద్ద ఎవరూ ఉండరాదు అని కూడా హెచ్చరించింది.

Posted in Uncategorized

Latest Updates