ఉదయం 9 గంటల వరకు 9.37 శాతం పోలింగ్‌ నమోదు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.37 శాతం పోలింగ్‌ నమోదైంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.  పోలింగ్‌ కేంద్రాలల్లో రాజకీయ, సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా క్యూలైన్లలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates