ఉద్దానంపై పోరాటం : పవన్ 24 గంటల దీక్ష ప్రారంభం

pawanhunger

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రభుత్వానికి 17 డిమాండ్లు పెట్టారు. కిడ్నీ బాధితుల విషయంలో పవన్ పెట్టిన డెడ్ లైన్ కు చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవటంతో.. ఈ దీక్షకు దిగారు. మే 26వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. శ్రీకాకుళంలోని ఓ రిసార్ట్స్ లో ఈ దీక్ష చేపట్టారు. కిడ్నీ బాధితులపై ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆరోగ్య మంత్రిని అయినా నియమించకపోవటాన్ని తప్పుబట్టారు.

బహిరంగ ప్రదేశం చేపడితే.. అభిమానులు, కార్యకర్తలు, ఫ్యాన్స్ ను అదుపు చేయటం కష్టం అని భావించిన.. రిసార్ట్స్ ను దీక్షా వేదికగా మార్చుకున్నారు. నిరాహార దీక్ష కోసం ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. పోలీస్ శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో రిసార్ట్స్ వేదికగా తన దీక్ష చేపట్టారు. 24 గంటల ముందు నుంచే ఘనాహారం తీసుకోవటం మానేశారు పవన్. జనసేన పవన్ దీక్షపై ప్రభుత్వం ఇప్పటి కూడా స్పందించకపోగా.. అనుమతి కూడా ఇవ్వకపోవటాన్ని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని.. ఇలాంటి దీక్షలు మరిన్ని ఉంటాయన్నారు. ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చే పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తానని జనసేన ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates