ఉద్దానంపై పోరాటం : శ్రీకాకుళంలో పవన్ నిరాహార దీక్ష

PK DEEKSHHKA

ఉద్దానం బాధితుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన నిరాహారదీక్ష కొనసాగుతుంది. శనివారం (మే-26) శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆయన ప్రజల మధ్య దీక్షలో కూర్చున్నారు. శుక్రవారం (మే-25) సాయంత్రం మొదలైన దీక్ష ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంగిచనున్నారు పవన్. జనసేన అధినేతకు మద్దతుగా జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడలోనూ ఆపార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగేలా శాంతియుతంగా పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పవన్ దీక్షకు మద్దతుగా యువకులు, ఉద్దానం కిడ్నీ బాధితులు వేదిక వద్దకు భారీగా తరలివచ్చారు.

పూర్తి శాంతియుతంగా జరిగే ఈ దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఉద్దానం ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది జనసేన.  ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందిచకపోతే దీక్షకు దిగుతానని పవన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates