ఉద్దానం కిడ్నీ సమస్య తీర్చకపోతే నిరాహారదీక్ష చేస్తా: పవన్‌

pawan
ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేనప్పుడు లక్షల కోట్ల బడ్జెట్లెందుకన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన.. కాశీబుగ్గలో ఉద్దాన కిడ్నీ బాధితులతో  మాట్లాడారు. గతంలో జనసేన చేసిన ఆందోళనతో.. ప్రభుత్వంలో కదలిక వచ్చి.. కొన్ని చర్యలు చేపట్టినా.. అవి సరిపోవన్నారు పవన్. ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే నిరాహారదీక్ష చేస్తానన్నారు. 48 గంటల్లో సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాను చేపట్టిన పోరాట యాత్ర ఆపి ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు జనసేనాని పవన్.

Posted in Uncategorized

Latest Updates