ఉద్యోగాలు పిలుస్తున్నాయ్ : రైల్వేలో 62,907వేల ఉద్యోగాలు

railway
రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. కొద్ది రోజుల క్రితం విడుదలయిన నోటిఫికేషన్ కంటే కూడా ఈసారి భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చింది రైల్వేశాఖ. వివిధ శాఖల్లో 90 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇందులో 10వ తరగతి క్వాలిఫికేషన్ తో అత్యధికంగా 62 వేల 907 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది.

పోస్టులు:  ట్రాక్‌మెన్ ట్రైనర్, గేట్‌మెన్, పాయింట్స్ మెన్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ సిగ్నల్/ టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో హెల్పర్స్, పోర్టర్స్.

అర్హత: దరఖాస్తు దారులు 10 వ తరగతి, ITI, NAC జారీ చేసిన NCTV సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఏజ్ లిమిట్: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST దరఖాస్తుదారులకు 5 ఏళ్లు, OBC దరఖాస్తుదారులకు 3 ఏళ్లు ఏజ్ సడలింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ. 18 వేల వేతనంతో పాటు అలవెన్సులు పొందుతారు.

దరఖాస్తు ఆఖరు తేదీ:  మార్చి 12, 2018.

 

Posted in Uncategorized

Latest Updates