ఉద్యోగాల పేరుతో మోసం.. రూ.19 లక్షలు స్వాధీనం

విదేశాల్లో ఉద్యోగాల  పేరుతో యువతులను  మోసం చేస్తున్న … వ్యక్తిని  అదుపులోకి  తీసుకున్నారు  రాచకొండ పోలీసులు.  విదేశాల్లోని  NRI ఫర్ఫ్యూమ్  కంపెనీల్లో  ఉద్యోగాలంటూ  ఇంటర్వ్యూ పేరుతో.. ఢిల్లీకి పిలిచి దోపీడీ  చేస్తున్న  తల్వింధర్ సింగ్ ను  అరెస్ట్ చేశారు.  ఢిల్లీ కేంద్రంగా  జరుగుతున్న ఈ దోపీడీపై  ఎల్బీనగర్ కు  చెందిన  ఓ బాధితురాలు  ఫిర్యాదు చేయడంతో…కేసు  నమోదు చేసి  అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి  19లక్షల  నగదు, 15తులాల  బంగారు  ఆభరణాలు  స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates