ఉద్యోగాల పేరుతో మోసం : రూ.24 లక్షలు స్వాధీనం

లక్ష కొడితే చాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగం నీ ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తుంది. 2 లక్షలైతై గవర్నమెంట్ జాబ్ కన్ఫమ్. ఇలాంటి మాటలతో అమాయకులను బురిడీ కొట్టించు లక్షలు దండుకున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు.  ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను గురువారం (ఆగస్టు-2)  పశ్చిమ, మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ముఠా సభ్యులను సీపీ అంజనీ కుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొత్తం 8 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ముఠా సభ్యుల నుంచి రూ. 24.1 లక్షల నగదు, నకిలీ నియామక పత్రాలు, యూనిఫామ్స్, ల్యాప్‌ టాప్‌ తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ట్యాలెంట్ ఉంటే జాబ్ అదే వస్తుంది..ప్రభుత్వ, ప్రైవేట్ జాబ్స్ పై ఎలాంటి లంచాలు ఇవ్వకూడదని సూచించారు సీపీ.

Posted in Uncategorized

Latest Updates